విద్యాహక్కు చట్టం తక్షణమేఅమలు చేయాల్సిందే – ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్

అన్నమయ్య జిల్లా,పుంగనూరు, రాజనీతి,జూలై 27,విద్య అనేది ప్రతి చిన్నారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, *విద్యాహక్కు చట్టం (RTE-2009)ను ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరు పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించబడింది.ఈ ర్యాలీ స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ప్రారంభమైంది. అనంతరం విద్యార్థులు, యువత, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మధ్యలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి, విద్యాహక్కు చట్టం...