బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్
రేణిగుంటలో ఘనంగా 'మన ఊరు – మన జెండా' కార్యక్రమం రేణిగుంట, జూలై 27 (రాజనీతి): భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక మన ఊరు – మన జెండా కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలో జిల్లా మన ఊరు – మన జెండా కన్వీనర్, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ జెండాతో పాటు బీజేపీ పార్టీ జెండా రెపరెపలాడుతుండగా కార్యకర్తలు భారత్ మాతాకీ జై, వందే మాతరం, జై శ్రీరామ్ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ...