నవ్వుల వెనుక రహస్యం..! ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్ అసలు కథ ఇదేనా?
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను మొదటిసారిగా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్‌లో చిట్టిబాబు కుటుంబ బాధ్యతలను స్వయంగా చూసుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. ఇంటి పనులు చేయడంలో ఎలాంటి సంకోచం లేకుండా వ్యవహరించే ఆయన పాత్ర చుట్టూ హాస్యభరిత సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే చివర్లో కుటుంబ సభ్యులు రక్తపు మరకలతో కనిపించే షాట్ కథలో మరో కోణం దాగి ఉందనే ఉత్కంఠను పెంచింది....