🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 24 Jul, 2026 | Page: 1

జిల్లాలో ముమ్మరంగా పోలీసుల అవగాహన కార్యక్రమాలు

తిరుపతి, జూలై 24 (రాజనీతి): జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహించి గంజాయి, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు పోక్సో చట్టం, మహిళల భద్రత, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనంపై వివరించారు. పార్సిల్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద పార్సిళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
🏠 Home