🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 24 Jul, 2026 | Page: 1

పాఠశాల విద్యార్థులతో... తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు.

ఫర్ స్క్రోల్..
కలిచర్ల-పెద్దమండ్యం మండలం--అన్నమయ్య జిల్లా
24.7.2026

➤ పెద్దమండ్యం మండలం కలిచెర్ల లోని జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాలలో.. శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించిన మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల (మెగా పేరెంట్ టీచర్స్) ఆత్మీయ సమావేశం 4.0 లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

➤ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం.

➤ పాఠశాల నివేదికను ఎంఈఓ చదివి వినిపించారు.

➤ పాఠశాల విద్యార్థులతో... తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు.

➤ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పిటిఎం 4.0... విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుస్తుందని, పాఠశాలల అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్న కలెక్టర్ నిశాంత్ కుమార్

➤ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ఉపయోగం గురించి తల్లిదండ్రులకు వివరించిన కలెక్టర్.

➤ ప్రతి పిల్లవాడి అభ్యాస పురోగతిని పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచన.

➤ ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమన్వయంతో విద్యా నాణ్యత మెరుగుపరచాలన్న కలెక్టర్

➤ పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతులపై తల్లిదండ్రుల సూచనలు సేకరణ

➤ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరం అందుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించిన కలెక్టర్.

➤ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాల ప్రణాళిక.

➤ ఈ సందర్భంగా అంతకుముందు తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు, టగ్గాఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు.

➤ ఈ కార్యక్రమంలో డీఈవో సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష ఏపిసి అనురాధ, ప్రధానోపాధ్యాయురాలు సి.మీనానాగలక్ష్మి, ఎస్ఎంసి చైర్మన్ ఎం. గిరిజాపతి, వైస్ చైర్మన్ స్వర్ణ, ఎంఈఓలు పి మనోహర్, జి.రామకృష్ణ, తాసిల్దారు తేజస్విని, ఎంపీడీవో శ్రీధర్, డిప్యూటీ ఎంపీడిఓ విమల కుమారి, ఎంపీపీ పూర్ణ చంద్రిక రమేష్, మాజీ సర్పంచ్ విశ్వనాధ్, పాఠశాల స్థలదాత సుధాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సేవా భావులు, పూర్వపు విద్యార్థులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------////------------------
డిఐపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా
🏠 Home