ఆడబిడ్డ సృష్టికి మూలం ప్రగతికి చిహ్నం - డా:శ్రీగిరీష
సమాజ శ్రేయస్సు దృశ్య ఎ బిడ్డయిన ఒకటే అని తెలుసుకుని "ఆడశిశువును రక్షిద్దాం, మానవజాతి మునుగడను కాపాడుదాం." అని తలుపుల పి హెచ్ సి ప్రదానవైద్యాధికారులు డా:శ్రీగిరీష అన్నారు.
జాండ్ల గ్రామంలో నేడు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అంశంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ కొందరు ఆడబిడ్డ వద్దనుకునేవారు గర్భధారణ సమయంలో స్కానింగ్ సెంటర్లకు వెళ్లి లింగ నిర్ధారణ చేసుకొని తద్వారా ఆడపిల్ల అని తెలుసు వెంటనే గర్భస్రావము చేసుకొనుట చట్ట రీత్యా నేరమని ఇలా చేయించుకొనుట వలన ఆడపిల్లల సంఖ్య తగ్గి, ఆందోళన కలిగించే అంశం అని గిరీష మహిళలకు హితవు పలికారు.
ఈ విధంగా కొనసాగితే సమాజంలో అసమానతలు ఏర్పడి సమాజము ఆడ శిశువులను కోల్పోయి సమాజ అభివృద్ధి కుంటుపడడమే కాకుండా సమాజం అమ్మలేని అనాధ అవుతుందని, కావున బ్రూన హత్యలు నిర్మూలిద్దాం, మానవజాతి మనుగడకు వాగ్దానం చేద్దా,మని డా: శ్రీగిరీష మహిళలచే ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య, ఎంపిహెచ్ఇఓ శ్రీనివాసులు, పర్యవేక్షకులు నాగమ్మ, ఏఎన్ఎం కృష్ణమ్మ సిహెచ్ఓ లావణ్య, సుధా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.