🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించాలి: ఏఐటీయూసీ

మదనపల్లె, జూలై 23 (రాజనీతి): ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లె ఆర్టీసీ–2 డిపో వద్ద నిర్వహించిన నిరసనలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు జనార్దన్ మాట్లాడుతూ, విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని, ఔట్‌సోర్సింగ్ కార్మికులను శాశ్వతీకరించాలని కోరారు. ఖాళీ పోస్టులు భర్తీ చేసి, కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
🏠 Home