🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు ఇంటర్ అప్‌గ్రేడ్

కలికిరి, జూలై 23 (రాజనీతి): కలికిరిలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలికల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి పాఠశాలను పరిశీలించిన ఆయన, అదనపు తరగతి గదులు, డార్మిటరీ, డైనింగ్ హాల్, ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్య ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
🏠 Home