🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

ఇంటింటి సంక్షేమ సందేశానికి సిద్ధం కావాలి: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

కలికిరి, జూలై 23 (రాజనీతి): ఈ నెల 27 నుంచి పీలేరు నియోజకవర్గంలో ఇంటింటి సంక్షేమ సందేశం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. కలికిరిలో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రతి యూనిట్ రోజుకు 30 ఇళ్లను సందర్శించి, ప్రతి ఇంట్లో మూడు నిమిషాల పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని వివరించాలని సూచించారు. కరపత్రాలు పంపిణీ చేసి వివరాలను 'మై టీడీపీ' యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.
🏠 Home