టీబీపై అవగాహన కలిగి పరీక్షలు చేయించుకోవాలి
సోమల, జూలై 23 (రాజనీతి): టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ సిటిజన్లకు క్షయవ్యాధిపై అవగాహన సదస్సు, స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రాజ్‌కుమార్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఛాతినొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణైన వారికి ఉచిత చికిత్సతో పాటు ప్రధానమంత్రి పోషణ యోజన కింద నెలకు రూ.1,000 పోషకాహార భృతి అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.