🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

ఎన్‌టీఆర్ వైద్యసేవకు రూ.1,000 కోట్లు విడుదల

అమరావతి, జూలై 23 (రాజనీతి): రాష్ట్రంలో ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకం అమలు నిరంతరాయంగా కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెట్‌వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత, రాయితీ వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
🏠 Home