🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

ఎండీపీఎస్ కమిటీలను త్వరగా పూర్తి చేయాలి: పెద్దపల్లి శేఖర్

చిత్తూరు, జూలై 23 (రాజనీతి): ఎండీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీలను త్వరగా పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. మాదిగల సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని, గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను గుర్తించి అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. జాతి ఐక్యత, అభివృద్ధి కోసం నాయకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
🏠 Home