చిన్నసోమలలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్
సోమల, రాజనీతి,జూలై 23: సోమల మండలం చిన్నసోమల గ్రామం దక్షిణ దిక్కున ఉన్న చలపతి బీడు భూమిలో చింతచెట్టు కింద కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోమల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రమేష్ తన సిబ్బందితో కలిసి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.దాడిలో చిన్నసోమల గ్రామానికి చెందిన ముగ్గురు, సోమలకు చెందిన ఒకరు మొత్తం నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,050 నగదు, 52 పేకముక్కలు, ఒక పాత న్యూస్‌పేపర్ స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై ఏపీ గేమింగ్ చట్టం సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సోమల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రమేష్ తెలిపారు.