🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

మెగా పీటీఎం–4.0ను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఈనెల 24న జిల్లావ్యాప్తంగా జరిగే మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలి

జిల్లాలోని 2,259 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్

విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకం


మదనపల్లె, జూలై 22:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా రెండవ ఏడాది జిల్లాలో 1,92,728 మంది పిల్లలకు సంబంధించి 1,22,076 మంది తల్లులు/సంరక్షకుల ఖాతాలో నేడు 'తల్లికి వందనం నిధులు' జమ కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కారాదని, పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈనెల 24న జిల్లా వ్యాప్తంగా 2,259 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ సమావేశాన్ని పండుగ వాతావరణం లో నిర్వహించడం జరుగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఇందులో భాగంగా నిర్వహించే మెగా పిటియం కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

24.7.24న మెగా పిటిఎం కార్యక్రమం వివరాలు

1. ఉదయం 9.00 గం: తల్లిదండ్రులు దాతలు పాత విద్యార్థులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఘనస్వాగతం. మరియు తల్లిదండ్రులు విద్యార్థులతో పాటు తరగతి గదిలో కూర్చోవడం, ఫోటో కార్నర్ సెల్ఫీ పాయింట్, దీక్ష మరియు లీప్ యాప్ కోసం హెల్ప్ డెస్క్ నిర్వహణ.

2. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మధ్య ముఖాముఖి, విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చిస్తారు.

3. ప్రదర్శనలు మరియు ఫోటో గ్యాలరీ సందర్భంగా.

4. తల్లిదండ్రులకు పోటీలు.

5. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రధాన వేదిక చేరుకోవడం.

6. మెగా పేరెంట్ టీచర్ ప్రధాన ఉద్దేశం పై కార్యక్రమం నిర్వహణ.

7. చివరిగా హాజరైన వారందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం.

తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు–విద్యార్థుల మధ్య మరింత ఆత్మీయత, భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, డిప్యూటీ విద్యాశాఖాధికారులు సమన్వయంతో మండల విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మెగా పీటీఎం–4.0కు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
-----------------------------------///-------------------------- డిఐపిఆర్ఓ,అన్నమయ్య జిల్లా
🏠 Home