వాల్మీకిపురం తరిగొండ రూ.7.23 కోట్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కిషోర్.
TTD నిధులతో వాల్మీకిపురం, తరిగొండ ఆలయాల స్వరూపం మారుతోంది
వాల్మీకిపురం తరిగొండ రూ.7.23 కోట్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కిషోర్.
వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లోని ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ఈ మేరకు కూటమి శ్రేణులు, నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాల్మీకిపురం, తరిగొండ ఆలయాలకు రూ.7.23 కోట్లు మంజూరు చేయించారు.
వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న దక్షిణ దిశ రాజగోపురం, కోనేటి వీధిలో శ్రీవారి గరుడ పుష్కరిణి ఇందిరమ్మ కాలనీ వద్ద స్వాగత ఆర్చి తోట వీధి TTD కళ్యాణ వేదికపార్వేట మండపం, గుర్రంకొండ మండలం తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరు నిర్మాణ పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆలయాల అభివృద్ధి ద్వారా పీలేరు నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు. నల్లారి అభిమానులు పాల్గొన్నారు.