ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం రైతు చింతం వెంకటేశ్వర రెడ్డి మొక్కు ...
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం రైతు మొక్కు
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆశీర్వాదాలతో పాదయాత్ర ప్రారంభిస్తున్న చింతం వెంకటేశ్వర రెడ్డి.
అవయవాలు లేకపోయినా ఆశయం గెలిచింది
మొక్కు చెల్లించేందుకు కలికిరి నుండి తిరుమలకు పాదయాత్ర
పీలేరు:ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మొక్కుకున్న మొక్కును చెల్లించు కునేందుకు పీలేరు నియోజకవర్గం కెవి పల్లి మండలం వడ్లకుంట పంచాయతీ మంచాల మంద గ్రామానికి చెందిన రైతు చింతం వెంకటేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టారు.
రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వర రెడ్డి వ్యవసాయంలో నాలుగు సార్లు ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. వ్యవసాయం చేస్తుండగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఆయన రెండు చేతులు కోల్పోయారు. అయినప్పటికీ "అవయవాలు లేకపోయినా ఆశయం గొప్పది" అన్న సిద్ధాంతంతో జీవిస్తున్నారు.
పీలేరు నియోజకవర్గానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందితే కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్తానని ఆయన మొక్కుకున్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారి కార్యాలయానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం కలికిరి నగిరిపల్లి నుండి తిరుమల కు పాదయాత్ర ప్రారంభించారు.
రెండు చేతులు లేకపోయినా పట్టుదలతో, భక్తితో సాగుతున్న వెంకటేశ్వర రెడ్డి పాదయాత్రను చూసిన స్థానికులు ఆయన స్ఫూర్తిని అభినందిస్తున్నారు.