చిన్మయ ఆశ్రమ భూ వివాద పరిష్కారానికి చిత్తూరు ఎమ్మెల్యే చొరవ...
రూ.15 కోట్లతో విద్య, యోగ కేంద్రానికి మార్గం సుగమం....
ఆధ్యాత్మిక కేంద్రంగా ఇరువారం అభివృద్ధికి చర్యలు...
చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగర శివారులోని ఇరువారం సమీపంలోని చిన్మయ ఆశ్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ బుధవారం సందర్శించి ఆశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక చర్యలు చేపట్టారు. ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశ్రమ నిర్వాహకులతో సమావేశమై ఆశ్రమ అభివృద్ధి, భూ వివాదం, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆశ్రమానికి సంబంధించిన భూ వివాదం పరిష్కారంపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆశ్రమానికి సంబంధించిన పెండింగ్ భూ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి నిబంధనల మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ..., మహర్షి రమణ తపస్సు చేసిన పవిత్ర ప్రాంతంగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. భూ వివాదం పరిష్కారమైతే చిన్మయ ఆశ్రమం ఆధ్వర్యంలో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఆధునిక విద్యా కేంద్రం, యోగ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలైతే చిత్తూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు, యువత, ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఇక ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కాజూరు చెరువును కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం చెరువులో పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాదిలోపు చెరువు కట్టను బలోపేతం చేసి సుందరీకరణ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. చెరువు పరిసరాలను పర్యాటక, ఆధ్యాత్మిక ఆకర్షణగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఇస్కాన్ సంస్థ సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆధ్యాత్మికత, పర్యాటకం, విద్యను సమన్వయం చేస్తూ ఇరువారం ప్రాంతాన్ని ప్రత్యేక గుర్తింపు కలిగిన కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.చిన్మయ ఆశ్రమం చేపట్టనున్న విద్యా, యోగ కేంద్రాల ఏర్పాటు, చెరువు అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమల్లోకి వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిత్తూరు జిల్లాకు మరో ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఎమ్మెల్యే చొరవతో ఆశ్రమ భూ వివాదం త్వరలో పరిష్కారమై అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని ఆశ్రమ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కాజూరు బాలాజీ, అశోక్‌తో పాటు ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.