🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 21 Jul, 2026 | Page: 1

"యువత భవిష్యత్తును కాపాడుదాం... గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం"

తిరుపతి జిల్లా పోలీసు శాఖ.
తేదీ: 21-07-2026.

- "యువత భవిష్యత్తును కాపాడుదాం... గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం"

- జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ.

- సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మందికి బయోచెక్ కిట్లతో గంజా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ.

- సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు పరీక్షలు.

- అవగాహన – గుర్తింపు చట్టపరమైన చర్యలు – పునరావాసం అనే నాలుగు దిశల్లో జిల్లా పోలీసుల సమగ్ర కార్యాచరణ.

- జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగింపు.

తిరుపతి జులై 21: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, గంజాయి వినియోగాన్ని శాస్త్రీయంగా గుర్తించడం, అవసరమైన వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం, మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం ప్రాంతాలకు చెందిన 40 మంది వ్యక్తులకు బయోచెక్ కిట్ల సహాయంతో గంజా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సత్యవేడు సీఐ శ్రీ మురళీ నాయుడు ఆధ్వర్యంలో, వరదయ్యపాలెం ఎస్‌ఐతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ వ్యవస్థ, సమాజ శాంతి భద్రతలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా బయోచెక్ కిట్ల ద్వారా శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తూ, గంజాయి వినియోగదారులను గుర్తించడం, సరఫరా వ్యవస్థపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, అలాగే వ్యసనానికి గురైన వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వంటి చర్యలను జిల్లా పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేస్తోందనీ అన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి సందేశం ఇస్తూ...గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అదే సమయంలో వ్యసనానికి గురైన వారిని శిక్షించడం మాత్రమే కాకుండా, వారిని కౌన్సిలింగ్, డీ-అడిక్షన్, పునరావాస కార్యక్రమాల ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కూడా జిల్లా పోలీసు శాఖ సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు.

ప్రజల సహకారంతో గంజాయి రహిత తిరుపతి జిల్లాను నిర్మించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమని, ఈ దిశగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు, ఆకస్మిక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు మరియు చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు తెలిపారు.
🏠 Home