డెంగ్యూపై అప్రమత్తతే రక్షణ..! ఇంటింటికీ లార్వా సర్వేతో ప్రజల్లో అవగాహన
ములకలచెరువు, 2026 జూలై 21:
ములకలచెరువు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కొనేటివారిపల్లెలో ప్రత్యేక డెంగ్యూ అవగాహన కార్యక్రమం
డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ములకలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో కొనేటివారిపల్లె గ్రామంలో ప్రత్యేక డెంగ్యూ అవగాహన కార్యక్రమం మరియు లార్వా సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించిన ఆరోగ్య సిబ్బంది నీటి నిల్వలు, కూలర్లు, డ్రములు, టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర ప్రాంతాలను పరిశీలించి దోమల లార్వా ఉందా లేదా అనే అంశంపై సర్వే నిర్వహించారు. లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే గ్రామస్తులకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రపరచడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమతెరలు ఉపయోగించడం వంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
"డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యమే కీలకం. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉంటేనే డెంగ్యూను సమర్థవంతంగా అరికట్టవచ్చు" అని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ఆరోగ్య సిబ్బంది పాల్గొని ప్రజలకు ఆరోగ్య సూచనలు అందించారు.