విద్యార్థినులతో అల్పాహారం చేసిన చిత్తూరు ఎమ్మెల్యే...
బాలికలే భావి భారతానికి బలమైన శక్తి: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...
ఆత్మస్థైర్యంతో చదివి ఉన్నత శిఖరాలు చేరాలి...
సంక్షేమ వసతి గృహ విద్యార్థినులకు ప్రభుత్వ మెటీరియల్ పంపిణీ...
విద్యతోనే జీవిత లక్ష్యాలు సాధ్యం.. బాలికలకు ప్రోత్సాహం...
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): బాలికలు ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, సంక్షేమ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని వల్లియప్పనగర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన షూస్, బెడ్షీట్లు, టవళ్లు, స్వెట్టర్లు, యూనిఫాంలను పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి కుటుంబ నేపథ్యం, చదువులు, భవిష్యత్ ఆశయాలు, లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణతో శ్రమించాలని సూచించారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తోందని అవకాశాలను వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రోత్సహించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు విద్యార్థుల భవిష్యత్కు ఉపయోగపడే అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు విద్యా సామగ్రి విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నిత్యం వార్తలు చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆంగ్ల భాషతో పాటు ఇతర భాషలపై కూడా పట్టు సాధిస్తే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో మరింత ముందంజలో ఉంటారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు తమ వసతి గృహంలో టెలివిజన్ ఏర్పాటు చేయాలని కోరగా త్వరలోనే టీవీని అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రబ్బానీ భాష, ఇన్చార్జి ఏఎస్డబ్ల్యూవో వాసంతి, వసతి గృహ వార్డెన్లు, కూటమి నాయకులు ఈశ్వరరావు, రాము, చిట్టిబాబు, జీవరత్నం, గౌరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మమేకమవుతూ వారికి ప్రోత్సాహం అందించడం విశేషంగా నిలిచింది.