🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 21 Jul, 2026 | Page: 1

రుచికి బానిస.. ఆరోగ్యానికి శత్రువు..! నేడు వరల్డ్ జంక్ ఫుడ్ డే

2026 జూలై 21ను ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ (నేషనల్) జంక్ ఫుడ్ డేగా గుర్తించి జరుపుకుంటారు. ఈ రోజు జంక్ ఫుడ్‌ను ప్రోత్సహించడానికి కాదు.. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం.
బర్గర్లు, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్‌తో క్షణిక ఆనందం.. కానీ జీవితాంతం అనారోగ్యమా?
నేటి వేగవంతమైన జీవనశైలిలో పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్ వంటి జంక్ ఫుడ్లు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ అలవాటుగా మారాయి. రుచిగా అనిపించే ఈ ఆహారాల్లో అధికంగా చక్కెర, ఉప్పు, నూనె, కృత్రిమ రంగులు, రసాయనాలు ఉండటంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జంక్ ఫుడ్‌ను తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కొవ్వు కాలేయం, జీర్ణ సమస్యలు మాత్రమే కాకుండా పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, రోగనిరోధక శక్తి బలహీనపడడం వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చక్కెర పానీయాలకు బదులుగా నీరు, తాజా పండ్ల రసాలు తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

ఈ వరల్డ్ జంక్ ఫుడ్ డే సందర్భంగా ఒక చిన్న సంకల్పం చేద్దాం... "రుచిని ఆస్వాదిద్దాం.. కానీ ఆరోగ్యాన్ని కోల్పోకుండా!" ఎందుకంటే ఆరోగ్యమే మన జీవితానికి నిజమైన సంపద.
🏠 Home