టీ కప్పుతో చిత్తూరు మరియు పూతలపట్టు ఎమ్మెల్యేల సరదా ముచ్చట్లు
హానిబీ టీ దుకాణంలో సామాన్యులతో ఎమ్మెల్యేల టీ టైం...
బిజీ షెడ్యూల్‌కు బ్రేక్.. టీ తాగుతూ ప్రజలతో మాటామంతి....
చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): నిత్యం ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు అధికారిక సమావేశాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు సోమవారం సాయంత్రం కాసేపు తీరిక సమయాన్ని ఆస్వాదించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న హానిబీ టీ దుకాణాన్ని సందర్శించి సామాన్య ప్రజలతో కలిసి టీ తాగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు.ఎలాంటి హడావుడి లేకుండా మందిమార్బలానికి దూరంగా సాధారణ కస్టమర్ల మధ్య కూర్చొని టీ సేవించారు. అక్కడికి వచ్చిన యువత ,స్థానికులు, వ్యాపారులతో పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు సరదాగా సంభాషిస్తూ స్థానిక పరిస్థితులు, రోజువారీ జీవనం, చిన్నచిన్న సమస్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలను తమ మధ్య సాధారణ వ్యక్తుల్లా చూడడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.టీ దుకాణానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపగా వారు కూడా ఆప్యాయంగా స్పందించి అందరితో కలిసి సెల్ఫీలు దిగారు. కొంతసేపు నవ్వులు సరదా సంభాషణలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. టీ దుకాణ యాజమాన్యం ఎమ్మెల్యేలకు ఆతిథ్యం అందించగా స్థానికులు వారిని అభినందించారు.ప్రజల మధ్యకు వెళ్లి వారితో ప్రత్యక్షంగా మమేకం కావడం ఆత్మీయ వాతావరణంలో వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ప్రజాప్రతినిధులకు మరింత ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. బిజీ రాజకీయ అధికారిక కార్యక్రమాల మధ్య కాసేపు సాధారణ ప్రజలతో కలిసి టీ తాగుతూ గడిపిన ఈ "టీ టైం" అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులు కూడా సాధారణ జీవనశైలిని ఆస్వాదిస్తూ ప్రజలతో మమేకం కావడం విశేషంగా నిలిచింది.