షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకున్న ఆదిష్ ఇండియన్ స్కూల్ విద్యార్థినులు
కలికిరి, జూలై 20 (రాజనీతి): మదనపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో కలికిరి ఆదిష్ ఇండియన్ హై స్కూల్ విద్యార్థినులు గ్రీష్మ శ్రీ, స్నేహ ప్రతిభా అవార్డులు అందుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వారికి ప్రశంసాపత్రం, మెడల్‌తో పాటు రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. విద్యార్థినులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించగా, ప్రతి ఏడాది ఈ అవార్డులు సాధించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.