🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jul, 2026 | Page: 1

మదనపల్లిలో 24, 25న ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు

మదనపల్లి, జూలై 20 (రాజనీతి): జిల్లా కేంద్రం మదనపల్లిలో ఈ నెల 24, 25 తేదీల్లో ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి. నరసింహ కుమార్, ప్రధాన కార్యదర్శి బాబ్జీ తెలిపారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
🏠 Home