ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 72 ఫిర్యాదులు స్వీకరణ
మదనపల్లె, జూలై 20 (రాజనీతి): మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ 72 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూవివాదాలు 39, ఆర్థిక లావాదేవీలు 15, కుటుంబ కలహాలు 6, మోసం 5, సైబర్ 1, ఇతర సమస్యలు 6 ఉన్నాయి. నడవలేని స్థితిలో వచ్చిన బాధితుల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించిన ఎస్పీ, భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల విచారణ వేగవంతంగా పూర్తి చేసి నివేదికలు పంపాలని సూచించారు.