🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jul, 2026 | Page: 1

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 20 (రాజనీతి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా, ఫలప్రదంగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, గత నెలలో భారత్ పలు కీలక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. కాగా, సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును లోక్‌సభలో, వందేమాతరం గేయానికి జాతీయ గీత హోదా కల్పించే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
🏠 Home