జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన కలెక్టర్, ఎస్పీ..
పత్రికా ప్రకటన - తేదీ:19.07.2026
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన కలెక్టర్, ఎస్పీ..
రాయచోటి: అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ బి.సి.జనార్ధన్‌రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారు, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఆదివారం రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మదనపల్లెలో నిర్వహించనున్న 'షైనింగ్ స్టార్స్–2026', 'మై స్కూల్–మై ప్రైడ్' కార్యక్రమాల నిమిత్తం విచ్చేసిన మంత్రి గారికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారి పర్యటన నేపథ్యంలో మదనపల్లెలో చేపట్టిన కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను, జిల్లాలోని తాజా శాంతిభద్రతల పరిస్థితులను ఎస్పీ గారు ఆయనకు వివరించారు.