🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 19 Jul, 2026 | Page: 1

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

మదనపల్లె, జూలై 19 (రాజనీతి): మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఆదివారం ముస్లిం సోదరులు సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పంటలు సస్యశ్యామలం కావాలని, తాగునీటి సమస్యలు తొలగాలని ప్రార్థించారు. నీటి ప్రతి చుక్కను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, నీటి వృథాను నివారించి ప్రకృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
🏠 Home