🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 19 Jul, 2026 | Page: 1

సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన తిరుపతి పోలీసులు

తిరుపతి, జూలై 18 (రాజనీతి): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన విశాఖపట్నానికి చెందిన తాడేల సత్యనారాయణను తిరుపతి వెస్ట్ పోలీసులు సకాలంలో గుర్తించి ప్రాణాలు కాపాడారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ చలపతి ఆధ్వర్యంలో పోలీసులు గాలించి అతడిని సురక్షితంగా గుర్తించారు. అనంతరం భార్య, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి దంపతులను కలిపారు. సమస్యలకు ఆత్మహత్య కాదు, పరిష్కారమే మార్గమని ఎస్పీ సూచిస్తూ అవసరమైతే డయల్-112ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home