🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సాంబశివ ఎన్నిక

విజయవాడ రాజనీతి 2026 జూలై 18:-

జూలై 18న విజయవాడ లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమావేశంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తున్న సాంబశివ ను ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు

ఈ సందర్భంగా సాంబశివ, మాట్లాడుతూ

జూలై 18న విజయవాడలో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమావేశంలో నన్ను ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకోవడం పట్ల రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర సమితి సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నాపై ఉంచిన ఈ బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధన కోసం, కనీస వేతనాల అమలు, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కార్మిక వ్యతిరేక విధానాల రద్దు కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరింత సమర్థవంతంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కృషి చేస్తాను.

అన్నమయ్య జిల్లాలో ఏఐటీయూసీని మరింత బలోపేతం చేసి, ప్రతి కార్మికుడి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామన్నారు.

అన్నమయ్య జిల్లాలో ప్రతి రంగంలోని కార్మికులను సంఘటితం చేసి ఉద్యమాలను విస్తృతం చేస్తామని తెలిపారు
🏠 Home