🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

హైవేపై అదుపుతప్పి కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

పూతలపట్టు, జూలై 18 (రాజనీతి): పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. తిరుపతి నుంచి ముల్బాగల్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నిద్ర మత్తుతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
🏠 Home