🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

అత్యవసర సేవల్లో రాజీ లేదు.. 108 అంబులెన్స్ సేవలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్

పరికరాల పనితీరు, నాణ్యతపై ప్రత్యేక పరిశీలన.. అత్యవసర సమయంలో ప్రజలకు వేగవంతమైన సేవలందించాలని సిబ్బందికి సూచన

పీలేరు, జూలై 18:

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్ శనివారం పీలేరు మండలం బోడుమల్లవారిపల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సేవలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, వాటి పనితీరు, నాణ్యత, ఔషధాల లభ్యత, ఆక్సిజన్ సదుపాయం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో 108 అంబులెన్స్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజల నుంచి అత్యవసర కాల్ అందిన వెంటనే స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా సంఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత 108 సిబ్బందిపై ఉందని డాక్టర్ లోకవర్ధన్ సూచించారు. సేవల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, ప్రతి రోగికి సమయానుకూలంగా అత్యవసర వైద్య సహాయం అందేలా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

అత్యవసర వైద్య సేవల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి అంబులెన్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీ సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బందికి పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
🏠 Home