🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

పలమనేరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి సన్నాహాలు.. అమెరికా నాగరాజ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం

అర్హులైన రోగులకు ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుల వెల్లడి

పలమనేరు, జూలై 18:

పలమనేరు ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరం, కంటి శస్త్రచికిత్స కార్యక్రమం ఏర్పాట్లపై సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశం బైరెడ్డిపల్లి అమెరికా నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా శిబిరం నిర్వహణ, లబ్ధిదారుల నమోదు, కంటి పరీక్షల ఏర్పాట్లు, శస్త్రచికిత్సలకు ఎంపిక చేసే విధానం తదితర అంశాలపై నిర్వాహకులు సమగ్రంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి సంబంధిత సమస్యలకు నిపుణుల సలహాలు పొందాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడిన అమెరికా నాగరాజ్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య బృందం, స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామస్థులు సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలువురు సామాజిక సేవాకార్యకర్తలు, నిర్వాహకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని తమ సూచనలు అందించారు.
🏠 Home