బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో
టిడిపి హైకమాండ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలను సహించదు
- డ్వాక్రా రుణాలు చెల్లించలేకే చౌకబారు ఆరోపణలు
- వ్యక్తిగత సమస్యలకు తెలుగుదేశం పార్టీని వాడుకోవడం మంచిది కాదు
- పునరావృతమైతే అధిష్టానంద్వారా క్రమశిక్షణ చర్యలు తప్పవు
- పీలేరు వెలుగు ఎపిఎం అవినీతిపై విచారణకు సిద్ధమా
సవాల్ విసిరిన
దేశంనేత
నల్లారి రియాజ్
పీలేరు రాజనీతి
సుభాష్.. నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో.. పీలేరు వెలుగు ఏపిఎం పై నువ్వు చేసిన అవినీతి ఆరోపణలపై విచారణకు.. ఆధారాలతో అవినీతిని రుజువు చేయడానికి సిద్ధమ అంటూ పీలేరు మండల తెలుగు యువత అధ్యక్షులు నల్లారి రియాజ్ సవాల్ విసిరారు. పీలేరు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నేత సుభాష్ ప్రభుత్వ అధికారులపై పసలేని ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరతీసారని ఆరోపించారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులు డ్వాక్రా సంఘం ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో నిర్ణీత కాల వ్యవధి పూర్తయినా కానీ చెల్లించడంలో విఫలమయ్యారన్నారు. చెల్లింపులను సక్రమంగా నిర్వర్తించడానికి సంబంధిత వ్యవస్థ యంత్రాంగం సిబ్బంది ద్వారా ప్రయత్నించారన్నారు. తిరిగి చెల్లించడానికి చేతకాక వెలుగు ఏపిఎం అధికారిపై చౌకబారు ఆరోపణలను సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేయడం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇదేకాక ఇంతకు మునుపు కూడా తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలలో తన స్వార్థపూరిత చట్ట వ్యతిరేక వ్యక్తిగత పనులకు అధికారులు సహకరించడం లేదంటూ అధికారులపై నిరాధారమైన ఆరోపణలను చేశారన్నారు. తెలుగుదేశం పార్టీలో బ్లాక్మెయిల్ రాజకీయాలకు తావు లేదని అలాంటివారిని పార్టీ హైకమాండ్ ఉపేక్షించదని అన్నారు. నీ వ్యక్తిగత సమస్యలకు పార్టీని అడ్డం పెట్టుకుని చేసే నీ ప్రయత్నాలన్నీ పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఇకనైనా క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో కొనసాగాలనుకుంటే చౌకబార్ ఆరోపణలు మానుకొని చట్టపరంగా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని ఇతవు పలికారు.