🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

రెండు ఆంజనేయస్వామి ఆలయాల్లో చోరీ.. గ్రామస్థుల్లో ఆందోళన

సోమల, జూలై 18 (రాజనీతి): అన్నమయ్య జిల్లా సోమల మండలంలో రెండు ఆంజనేయస్వామి ఆలయాల్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇరికిపెంట పంచాయతీ బంగ్లా సమీపంలోని ఆలయంలో మైక్ సెట్, గంట, హుండీ, దీపాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. అలాగే సోమల యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి రెండు దీపాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
🏠 Home