🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

పిల్లల మధ్య వ్యవధి ఆరోగ్యమైన కుటుంబానికి పునాది: డాక్టర్ ప్రత్యుష

నిమ్మనపల్లి, జూలై 18 (రాజనీతి): జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ, పిల్లల మధ్య వ్యవధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యుష, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పిల్లల మధ్య సరైన వ్యవధి పాటించడం వల్ల తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, హెచ్‌పీవీ వ్యాక్సిన్, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home