వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి
ఎర్రవారిపాలెం, జూలై 17 (రాజనీతి): ఎర్రవారిపాలెం మండలం కోటకడపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన నియామకంపై రైతులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.