🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jul, 2026 | Page: 1

పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబును కలిసిన సోమల టీడీపీ నాయకులు

సోమల, జూలై 17 (రాజనీతి): సోమల మండలానికి చెందిన టీడీపీ నాయకులు పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని చల్లా బాబు నాయకులకు సూచించారు. పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమల మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పి. శివశంకర్, వరదం చిన్నబాబు, గవతకట్ల మణి, పాయల శివకుమార్, చాణిక్య, నరసింహులు, నాగార్జున తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home