డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
సోమల, జూలై 17 (రాజనీతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేయించుకున్న భుజం శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో కొనసాగాలని కోరుతూ సోమలలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన మండల అధ్యక్షుడు సూరిశెట్టి నాగభూషణం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కైవారం మురళి, జాకీర్ బాషా, కదిరి, షబ్బీర్ బాషా, యశ్వంత్, మోహన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.