ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించిన ఆరోగ్య అధికారులు
గుర్రంకొండ, జూలై 17 (రాజనీతి): డెంగీ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణలో భాగంగా గుర్రంకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కండ్రిగ గ్రామంలో నిర్వహించిన "ఫ్రైడే డ్రై డే" కార్యక్రమాన్ని హెల్త్ సూపర్‌వైజర్ ఎస్. మహబూబ్ బాషా పరిశీలించారు. గ్రామంలో నీటి నిల్వలు, దోమల లార్వా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను తనిఖీ చేసి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ నీటి నిల్వలను ఖాళీ చేయాలని ప్రజలకు సూచించారు. డెంగీ నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.