మెగా గంజాయి పరీక్షలు.. 62 మందికి బయో-చెక్ టెస్టులు
తిరుపతి, జూలై 16 (రాజనీతి): తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రామ్ తులసి కళ్యాణ మండపంలో మెగా గంజాయి టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించారు. బయో-చెక్ కిట్లతో 62 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించి, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి వినియోగదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. 'డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా' లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాల సమాచారం ఉంటే 1972 ఈగల్ హెల్ప్‌లైన్ లేదా డయల్-112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.