ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
సోమల, జూలై 16 (రాజనీతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ సోమల మండలం కందూరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలో ఆయనకు కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో ఈ పూజలు చేపట్టినట్లు నాయకులు హరినారాయణ, రఘు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రభుకుమార్, విజయకుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొని పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.