🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 16 Jul, 2026 | Page: 1

బైండ్ ఓవర్ ఉల్లంఘించిన రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

రేణిగుంట, జూలై 16 (రాజనీతి): బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ ఘర్షణ ఘటనలో పాల్గొన్న రౌడీషీటర్ సేతు దిలీప్ కుమార్ అలియాస్ తంబికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితుడైన అతడిని గతంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండ్ ఓవర్ చేసినప్పటికీ, ఇటీవల మరో కొట్లాట ఘటనలో పాల్గొనడంతో మళ్లీ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని రేణిగుంట పోలీసులు హెచ్చరించారు.
🏠 Home