🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 16 Jul, 2026 | Page: 1

వ్యక్తిగత ప్రచారానికి పార్టీ పేరును వాడొద్దు: జనసేన నాయకుల హెచ్చరిక...

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు: చిత్తూరు జనసేన నేతలు...

సొంత కార్యకర్తలపై ఆరోపణలు తగవు.. పిఓసి తీరుపై అసంతృప్తి...


చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): వ్యక్తిగత ప్రచారం కోసం పార్టీ పేరును వినియోగించడం మానుకోవాలని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చిత్తూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ వ్యాఖ్యలు, వ్యవహార శైలిలో సంయమనం పాటించాలని నాయకులు సూచించారు. ముఖ్యంగా పార్టీ పీఓసీ స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ కార్యకర్తలపైనే విమర్శలు చేయడం, వారివల్ల తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించడం పార్టీకి నష్టం కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇటువంటి ఆరోపణలు కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టించడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత పబ్లిసిటీ కోసం పార్టీ పేరును ఉపయోగించడం మానుకోవాలని వారు కోరారు. పార్టీ సిద్ధాంతాలు, అధినాయకత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త వ్యవహరించాలని సూచించారు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగ వేదికలపై చర్చించడం కంటే పార్టీ వేదికల్లోనే పరిష్కరించుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు.జనసేన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి చర్యలైనా వ్యాఖ్యలైనా ఎవరినీ ఉపేక్షించబోమని నాయకులు స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన స్థాయిలో స్పందన ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, సీనియర్ నాయకులు పూల చందు కుమార్, నగర అధ్యక్షుడు సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరణి అంజలి, నాయకులు వెంకటేష్, కుమార్, హరీశ్, పవన్, గల్లా రూపేష్, రెడ్డిగుంట కిషోర్, సురేష్, సుధాకర్, కాలూ, రూరల్ నాయకులు బాలకృష్ణ, భరత్, కార్తీక్, వీర మహిళలు, సీనియర్ నాయకురాళ్లు జయంతి, గౌరీ, యామిని తదితరులు పాల్గొన్నారు.
🏠 Home