మై భారత్ పోర్టల్ నేషనల్ ఫస్ట్ ఛాలెంజ్‌లో జాతీయ స్థాయిలో 5వ స్థానం సాధించిన వెంకట లోకేష్
వీరబల్లి :
కడప జిల్లా వీరబల్లి మండలంలోని ఎస్‌డీకేఆర్ (SDKR) డిగ్రీ కళాశాల విద్యార్థి స్వామికేరి వెంకటలోకేష్ మై భారత్ పోర్టల్ ఆధ్వర్యంలో ఇటీవల నెలరోజుల పాటు నిర్వహించిన నేషనల్ ఫస్ట్ ఛాలెంజ్ ఆన్‌లైన్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో ఆయన జాతీయ స్థాయిలో 5వ స్థానం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినట్లు కళాశాల డైరెక్టర్ రవిశేఖర్ రెడ్డి, VRDS స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 17న లక్నోలో జరిగే కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా వెంకట లోకేష్ ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా వెంకట లోకేష్‌ను కళాశాల డైరెక్టర్, అధ్యాపకులు, సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.