పీలేరులో విషాదం.. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో విద్యార్థిని మృతి
పీలేరు, జూలై 14 (రాజనీతి):
అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పీలేరు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు రహీమున్నీసా కుమార్తె అసిన్ తాజ్ (17) ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందింది.
సమాచారం ప్రకారం, తన తల్లిని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చేందుకు అయ్యప్పరెడ్డి కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై ఉర్దూ పాఠశాల వైపు వెళ్తుండగా, పీలేరు పాత బస్టాండ్ సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అసిన్ తాజ్ బస్సు కిందపడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలు ఇటీవల ఎంసెట్‌లో అర్హత సాధించి, ఉన్నత విద్యలో ప్రవేశం కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో ఉండటం గమనార్హం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థిని అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పీలేరు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ లోకేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.