🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 14 Jul, 2026 | Page: 1

మహిళల భద్రతే లక్ష్యం.. గ్రామస్థులకు పోలీసుల అవగాహన

తిరుపతి, జూలై 14 (రాజనీతి): తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు కొడూరు రూరల్ సీఐ ఆధ్వర్యంలో గ్రామస్థులకు మహిళల భద్రత, మహిళా సాధికారత, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. శక్తి యాప్, అత్యవసర సేవల కోసం డయల్-112 వినియోగంపై వివరించారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు అపరిచితులకు చెప్పొద్దని, అనుమానాస్పద ఘటనలు లేదా నేరాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
🏠 Home