🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 11 Jul, 2026 | Page: 1

పోక్సో కేసులో సమర్థ దర్యాప్తుకు ఎస్సై ధర్మారెడ్డికి ప్రశంసాపత్రం

రేణిగుంట, జూలై 11 (రాజనీతి): తిరుపతి జిల్లా పోలీసు శాఖలో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించి పోక్సో కేసులో నిందితుడికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష పడేలా కీలక పాత్ర పోషించిన రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్సై కె.ధర్మారెడ్డిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ప్రత్యేకంగా అభినందించారు. వడమాలపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో చట్టం సెక్షన్ కేసు దర్యాప్తులో ధర్మారెడ్డి అందించిన విశేష సేవలు, బలమైన సాక్ష్యాధారాల సేకరణ, సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయడాన్ని గుర్తించి జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు ఫలితంగా చిత్తూరు జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించడం పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచిందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చేతుల మీదుగా ఎస్సై ధర్మారెడ్డి ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, వృత్తిపరమైన నైపుణ్యం, న్యాయం సాధించడంలో ప్రదర్శించిన అంకితభావం ఇతర పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ అభినందించారు.
🏠 Home