🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 11 Jul, 2026 | Page: 1

వారపు సంతలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ హరీష

రేణిగుంట, జూలై 11 (రాజనీతి): రేణిగుంట వారపు సంతలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దొంగతనాలు, జేబుదొంగల బెడద, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా గాజులమండ్యం ఎస్‌ఐ హరీష ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు. సంతలోని అన్ని ప్రాంతాలను కాలినడకన పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ హరీష మాట్లాడుతూ సంతకు వచ్చే ప్రజలు తమ నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గమనించినా, దొంగతనాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తారని తెలిపారు.
🏠 Home