చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి –ఆటో, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జూలై 21న పుంగనూరులో ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయండి*
*సాంబశివ, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి*
పుంగనూరు, రాజనీతి,రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, చిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ,చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.శనివారం పుంగనూరు స్థానిక ప్రశాంత్ నగర్ లో ఏఐటీయూసీ పుంగనూరు పట్టణ అనుబంధ సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కనీస వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు కల్పించడంతో పాటు, ఉద్యోగ రక్షణకు చట్టపరమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.
ఆటో డ్రైవర్లు, హమాలీ కార్మికులు నిత్యం శ్రమిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. వీరి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పెన్షన్, ప్రమాద బీమా, ఆరోగ్య సేవలు, పిల్లల విద్య, గృహ సదుపాయాలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో వారి విధులకు సంబంధంలేని పనులు చేయించడం వెంటనే నిలిపివేయాలని అన్నారు. ప్రజారోగ్యం, శిశు సంక్షేమ సేవల కోసం నియమించబడిన ఈ కార్యకర్తలపై అదనపు భారం మోపడం వల్ల అసలు సేవలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేస్తున్న సెస్ నిధులను పూర్తిస్థాయిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో జమ చేసి, అర్హులైన కార్మికులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధనతో పాటు అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు జూలై 21న పుంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, ఆటో, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని సాంబశివ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్,నాయకులు వెంకటరమణ రెడ్డి, రాంమూర్తి, మున్నా,రెడ్డప్ప,తిరుమలై, చలపతి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు